calender_icon.png 2 July, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విభాషా చిత్రంలో.. శక్తిమంతమైన పాత్రలో

17-06-2025 12:00:00 AM

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. తమిళ-, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయాన్ని ఇదివరకు టీమ్ వెల్లడించింది. రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్, సునీల్, పాలడబ్బా తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నట్టు గతంలో ప్రకటించారు.

ఇప్పుడు మరో నటీమణి పేరు టీమ్ అధికారికంగా రివీల్ చేసింది. ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామి ఈ ప్రాజెక్టులో చేరినట్టు తెలిపింది. తమిళ చిత్రాలు ‘రాట్సానన్’, ‘అసురన్’లలో ఈ భామ తన అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా చిత్రం విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు, కెమెరా మెన్ విజయ్ మిల్టన్ ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

గతంలో విజయ్ మిల్టన్ దర్శకత్వం లో వచ్చిన గోలీసోడా వెబ్ సీరిస్‌లో కూడా అమ్ము అభిరామి మంచి పాత్రలో కనిపించింది. అంటే వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రమన్నమాట. ఈ చిత్రంలో అమ్ము అభిరామి పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుందని టీమ్ చెబుతోంది. ఆమె అభినయం, పాత్ర చిత్రానికి ప్లస్ అవుతుందని, ఆమెలోని పలు కొత్త కోణాలు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని అంటున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.