1 July, 2026 | 5:18 PM

వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా

01-07-2026 04:46 PM

దమ్మపేట,(విజయ క్రాంతి): జులై మొదటి తారీకు నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివిక మిషన్ ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం దమ్మపేట గ్రామపంచాయతీ ఎదుట ఉపాధి కూలీల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్ పగడాల రమాదేవికి అందజేశారు.

ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఉపాధిహమి చట్టం వలన పని లేని రోజుల్లో ఈ చట్టం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అట్లాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం తొలగించి పేదల నోటి కాడ బువ్వను లాగేస్తుందని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు వేతనం, 200 రోజుల పని దినాలు కల్పించాలని, విబిజి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, ఉపాధి కూలీలు మద్ది రావమ్మ, భాగ్యలక్ష్మి, నాగేశ్వరమ్మ, లక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.