1 July, 2026 | 5:10 PM

తులం బంగారం ఇవ్వాలి

01-07-2026 04:03 PM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి 

వాంకిడి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమావేశం మందిరంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ సతీష్, సింగల్ విండో చైర్మన్ జాబరే పెంటయ్య, గ్రంథాలయ చైర్మన్ లతో కలిసి చెక్కుల పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ హాయంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ రామ్ లాల్, స్థానిక సర్పంచ్ సిహెచ్. సతీష్, సింగల్ విండో చైర్మన్ జాబరే పెంటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం, మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, వాంకిడి ఉపసర్పంచ్ దీపక్ ముండే, నాయకులు, కార్యాలయ సిబ్బంది, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.