1 July, 2026 | 5:52 PM

విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి

01-07-2026 04:48 PM

* విద్యుత్ శాఖ ఎస్ ఈ శేషారావు రాథోడ్ 

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో పెండింగ్ లో ఉన్న బకాయి బిల్లులను విద్యుత్ వినియోగదారులు చెల్లించాలని విద్యుత్ శాఖ  ఎస్ ఈ శేషారావు రాథోడ్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులపై  విద్యుత్ శాఖ సిబ్బందితో  సమీక్ష నిర్వహించిన అనంతరం  బకాయి దారుల వద్ద నుండి  బిల్లులు చెల్లించాలని  సూచనలు చేశారు. కొంతమంది వద్ద పెండింగ్ బిల్లులను  వసూలు చేసి రసీదు అందజేశారు. ఆయనతో పాటు  ఏఈ రోహిదాస్ జాదవ్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.