11 March, 2026 | 8:22 AM

రేపటి నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

06-12-2025 08:00 PM

పోస్టర్లు విడుదల..

భీమారం (విజయక్రాంతి): ఈ నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు మెదక్ లో జరుగనున్న సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్లను శనివారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఐటీయు మండల నాయకురాలు రంగు సరిత మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కరమే ద్యేయంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అని, కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ కు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరించడం చాలా దారుణమన్నారు.

బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను రద్దు చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా ఈ చట్టాలను తెచ్చారన్నారు. ఈ చట్టాలు అమలు జరిపి కార్మికులను బానిసలుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను, భవిష్యత్తు కార్యచరణను ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. మెదక్ లో జరిగే  ర్యాలీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అనసూర్య, గురువమ్మా, విజయ, శ్యామల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.