11 March, 2026 | 5:16 AM

నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: డిఎస్పీ రెహమాన్

06-12-2025 08:00 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చుంచుపల్లి రామాలయం నుండి బైపాస్ రోడ్డు వరకు కొత్తగూడెం సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు డిఎస్పీ రెహమాన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో సుమారుగా అధికారులు,సిబ్బంది కలిసి మొత్తం 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ అధికారులంతా పాల్గొన్నారు.