calender_icon.png 6 December, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో మానే ప్యానల్ గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ ప్రచారం

06-12-2025 07:56:33 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఎం, గోండ్వాన దండకారణ్యం పార్టీ, ఆదివాసి జేఏసీ మద్దతుతో బిఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ, కూటమి వార్డు సభ్యుల విజయాలను కోరుతూ పట్టణంలోని 15,17 వార్డులో ఎమ్మెల్సీ తాత మధు శనివారం  విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. భద్రాచలం గ్రామ సర్పంచిగా అన్ని అర్హతలు ఉన్న మానే రామకృష్ణ గెలిచి తీరుతారని ఆయన జోష్యం చెప్పారు.

ప్రజలకు సేవ చేసే వారిని ప్రజలు గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. ఆనాటి బిఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగా ఉపకరించాయో ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఈనెల 11వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బిఆర్ఎస్ కూటమిని గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ,స్థానిక నాయకులు వార్డ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.