యువతకు సివిల్స్ ర్యాంకర్లు ఆదర్శం
l హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్
కరీంనగర్ సిటీ, ఏప్రిల్ ౨౧: యువత సివిల్స్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ సూచించారు. సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని ఇటీవల సివిల్స్‌లో ర్యాంకులు సాధించి న నందాల సాయికిరణ్, కొలనుపాక సహనకు కరీంనగర్ మంకమ్మతోటలోని ఆయన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను న్యాయమూర్తి సన్మానించారు.
అనంత రం జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడి ఉద్యోగ వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నేటి యువత సన్మార్గంలో పయనించాలని చెప్పారు. పుట్టిన గడ్డ గర్వపడేలా మరో పది మందికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి కే వెంకటేశ్, 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేశ్, న్యాయవాదులు ఉప్పల అంజనీప్రసాద్, ఏవీ రమణ, ఏ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






