సివిల్స్ ర్యాంకర్‌కు ఘనస్వాగతం
l జీపులో ఊరేగించిన గ్రామస్థులు
సిద్దిపేట, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): సివిల్స్‌లో 321ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్‌యాదవ్‌కు గ్రామంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్న అఖిల్‌యాదవ్ ఆది వారం గ్రామానికి చేరుకున్నారు. సివిల్స్ లో 321ర్యాంకు సాధించిన అఖిల్‌యాదవ్ వస్తున్నాడని తెలియగానే గ్రామస్థు లు, బాల్యస్నేహితులు, యాదవ సంఘం నాయకులు భారీ ఊరేగింపు నిర్వహించారు. అఖిల్ తల్లిదండ్రులు నరేశ్, లలితతో పాటు అఖిల్‌యాదవ్‌ను గజమాలతో సత్కరించడంతోపాటు టాప్‌లెస్‌జీప్‌లో గ్రామమంతా ఊరేగించారు. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కష్టపడి తన చదువుకు సహకరించిపందుకు వారి శ్రమకు తగ్గ గౌరవం దక్కింద ని అఖిల్‌యాదవ్ తెలిపారు. దేశాభివృద్ధిలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు స్వాగతం పలికిన గ్రామస్థులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.






