21 July, 2026 | 7:00 AM

హమాలీ కార్మికుల ధర్నా

20-07-2026 03:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా aituc అనుబంధం సివిల్ సప్లై హమాక్ కార్మికులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపధ్యక్షలు కామ్రేడ్ భూక్యా రమేష్ మాట్లాడుతూ... సివిల్ సప్లై హమాలీ లు 03 నెలల రేషన్ చేయమని నెల వారీగా రేషన్ చేస్తామని అన్నారు దీని కారంగా హమాలీల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఒత్తిడి కారణంగా గుండె  సమస్యలు వస్తున్నాయని అన్నారు. మూడు నెలల రేషం చేయమని అధికారుల ఒత్తిడి కారణంగా adilabad జిల్లా జైనాద్ మండల హమాలీ చనిపోయారని అన్నారు 

ప్రతినెలా 10 వ తేదీన బిల్లులు చెల్లించే వారని ఇప్పుడు రెండు నెలలు అయినా చెల్లించడం లేదని అన్నారు దీని కారణంగా హమాలీ లు వారి కుటుంబ అవసరలకు అప్పు కై వెళ్లే పరిస్థితి వస్తుంది కావునా బిల్లులు ప్రతి నెల 10 వ తేదీ చెల్లించాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోపెండరి ముత్యం, పుండలికు,పిట్టల  భీమేష్ , పిల్లి రమేష్, జాదవ్ రమేష్ బదర్ గం చెక్క శివాజీ అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ల నుండి హమాలీ కార్మికులు హాజరయ్యారు.