21 July, 2026 | 7:00 AM

పోస్ట్ కార్డు ఉద్యమం

20-07-2026 03:24 PM

నిర్మల్(విజయక్రాంతి): కెజిబివి, యుఆర్ఎస్, సర్వ శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేసి సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్యుటీఎఫ్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. సోమవారం లక్ష్మణ చందా కేజీబీవీ పాఠశాలలో పోస్ట్ కార్డు ఉత్తరాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ యుటిఎఫ్ నిర్మల్ జిల్లా  ప్రధాన కార్యదర్శు పెంట అశోక్ మాట్లాడుతూ కేజీబీవీ, యుఆర్ఎస్, సర్వ శిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించడం కోసం ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్యుటీఎఫ్ నాయకులు వినోద్ కుమార్ బాపూరెడ్డి నారాయణ నవత  సిబ్బంది పాల్గొన్నారు