22 April, 2026 | 1:35 AM

కల్లు దుకాణంలో గొడవ.. వ్యక్తి మృతి

22-04-2026 12:00 AM

చేగుంట ఏప్రిల్ 21 :  కల్లు దుకాణంలో గొడవపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మసాయిపేట్ మండల కేంద్రం లో చోటుచేసుకుంది. చేగుంట ఎస్త్స్ర చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..పట్టణనికి చెందిన గుడ్డి దశరత్ (49) అదే గ్రామానికి చెందిన వడ్డే నగేష్, అతని అనుచరులు వడ్డే శ్రీకాంత్, వడ్డే దుర్గ స్వామి వడ్డే సందీప్, కలిసి కళ్ళు దుకాణంలో గొడవ పడగా గుడ్డి దశరథ్ ను వడ్డే శ్రీకాంత్ మధ్యలో వచ్చి తాగిన మైకంలో పక్కనే ఉన్న పెద్ద బండ రాయితో దశరత్ తలపై కొట్టగా, అతను స్పృహ  తప్పి పడిపోవడంతో,

విషయం తెలుసుకున్న అతని తమ్ముడు రమేష్ దశరత్ తీవ్ర గాయాలతో ఉండగా చనిపోలేదని గ్రహించి  గ్రామస్తులు సహాయంతో 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్త్స్ర చేతన్య కుమార్ రెడ్డి సంఘటన చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,  .

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

 మాసాయిపేట్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన కల్లు దుకాణంలో గొడవపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన విషయం తెలుసుకొని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, రామయంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్  రాజా గౌడ్, ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే నలుగురు  అనుమానితులను అదుపులో తీసుకున్నట్టు , హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తమ్ముడు గుడ్డి సిద్ధి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.