ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
మిర్యాలగూడ, ఏప్రిల్ 21: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు నేటి నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెకు ఉద్యోగ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు మిర్యాలగూడ డిపో జేఏసీ నాయకులు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజియన్ కార్యదర్శి గోపనబోయిన శ్రీనివాస్, డిపో కార్యదర్శి వలిశెట్టి సత్యనారాయణ, యస్.సి/యస్.టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రీజియన్ కార్యదర్శి కడియం రమేష్, అధ్యక్షులు దైద బాల తదితరులు సోమవారం ప్రకటించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2017 పేస్కేల్ బకాయిలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, 2021, 2025 పేస్కేలు ఔట్సోర్సింగ్ విధానం రద్దు, తదితర 32 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజలు ఆర్టీసీ ఉద్యోగ సిబ్బంది కి తమ పూర్తి మద్దతు తెలపాలని వారు కోరారు.






