calender_icon.png 22 February, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణతో మాలలకు అన్యాయం

22-02-2026 02:14:46 AM

రోస్టర్ పాయింట్లను పున సమీక్షించాలి

రాష్ట్ర మాల సంఘాల జేఏసీ

ముషీరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): వర్గీకరణ ద్వారా మాలలకు జరుగు తున్న అన్యాయంపై అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లు పెట్టాలని మాల సం ఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గ నాయకులు సీఎంను ఒప్పించాలని కోరింది. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న),  గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్ మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ అమలుతో విద్య, ఉద్యోగాల్లో మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం సమాధానం చెప్పాలని, ప్రతిపక్ష పార్టీలు ప్రభు త్వాన్ని నిలదీయాలని కోరారు. రోస్టర్ పాయింట్లను పునః సమీక్షించి, న్యాయంగా రావాల్సిన మరో 2 శాతం రిజర్వేషన్లను మాలలకు కేటాయించాలన్నారు.

అసెంబ్లీలో మాలల తరఫు న మాట్లాడుతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజుకు జేఏసీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోక పోతే ’మాలల పంతం-కాంగ్రెస్ అంతం’ అనే నినాదంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట మే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎం. నరసింహయ్య, ఎం. రాహుల్, సి. నాగేశ్వర్ రావు, డి.గీత బాస్కర్, ఎల్. మనోజ్ కుమార్, పి. అనిత, కె. బాలరాజు, బి.రమేష్ పాల్గొన్నారు.