calender_icon.png 22 February, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో నిజాయితీ ఏదీ?

22-02-2026 02:12:58 AM

నోట్ల వర్షం కురిసినా పట్టింపు కరువు

కోడ్ ఉల్లంఘించినా కళ్లు మూసుకున్న ఎన్నికల అధికారులు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎం.పద్మనాభరెడ్డి బహిరంగ లేఖ 

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇటీవలే ముగిసిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నిజా యితీ లోపించిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగింది. ఎన్నికల ప్రక్రియలో డబ్బు, మద్యం ఏరులై పారుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూసిందని ధ్వజమెత్తింది. ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి శనివారం ఎన్నికల కమిషనర్‌కు  ఒక లేఖ రాశారు.

రాష్ర్టంలోని సుమా రు 10 వేల కీలక గ్రామ పంచాయతీల్లో సగటున ఒక్కో అభ్యర్థి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారని తెలిపారు.  కొన్ని గ్రామాల్లో డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే రాస్తారోకోలు చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని, అయినప్పటికీ ఎన్నికల సంఘం మౌనంగా ఉం డటం దారుణమని మండిపడ్డారు.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు దేవుని ఫొటోలు పట్టుకుని ఇళ్లపైకి వెళ్తున్నారని  పేర్కొన్నారు. 

మీడియాలో ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా.. డబ్బు పంచిన అభ్యర్థులపై, డబ్బు తీసుకున్న ఓటర్లపై కేసు లు ఎందుకు నమోదు చేయలేదని ప్ర శ్నించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించింది.  ఎన్నికల సంఘం జారీ చేసి న నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. రాబో యే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ఇటువంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.