చంపత్‌రాయ్‌కి క్లీన్‌చిట్
అయోధ్య చోరీ కేసులో ట్రస్టుకు ‘సిట్’ నివేదిక
లక్నో, ఆగస్టు 18: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు సిట్ మంగళవారం క్లీన్‌చిట్ ఇచ్చింది. సిట్ తన తుది నివేదికను మందిర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్‌కు అందజేసినట్లు ఆలయ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులు జైలులో ఉన్నారు.
ఈ నివేదికను దాస్ సెప్టెంబర్ 2న జరిగే రామ మందిర ట్రస్ట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. జూన్ 13న యూపీ ప్రభుత్వం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం జూన్ 23న ప్రాథమిక నివేదికను సమర్పించింది. అనంతరం సుప్రీం ఆదేశాల మేరకు ఐజీ కిరణ్, డీఐజీ సోమెన్ వర్మ, ఎస్పీ గౌరవ్‌తో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది.






