1 September, 2026 | 11:29 PM

కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.

01-09-2026 | 10:54pm

రాజాపూర్: కేజీబీవీ పాఠశాలలో చదివే బాలికలు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudhan Nayak) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల,హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవనము, పరిసరాలను పరిశుభ్రంగా సిబ్బందికి సూచించారు. అనంతరం బాలికలతో మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఎస్ ఓ లక్ష్మీబాయి, సర్పంచ్ రామకృష్ణ,ఎంపీఓ పుష్ప, ఏపీవో భారతి, అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి వినయ్, తదితరులు పాల్గొన్నారు.