ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య
బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ కత్తుల నరేష్
తుంగతుర్తి,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై, నల్లగొండ జిల్లా భాజపా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్యఅని భాజపా సూర్యాపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ కత్తుల నరేష్ ఖండించారు. ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు, 22ఎ కుంభకోణంపై కాంగ్రెస్ సర్కారును భాజపా ప్రశ్నిస్తుండడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నేతలు ఈ విధ్వంస పూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. భాజపా కార్యాలయాలు, నాయకుల ఇండ్ల పైకి దాడికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కత్తుల నరేష్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు.






