07-12-2025 10:26:49 PM
గోవా: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం(Goa Nightclub Fire)లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా రిలీఫ్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Chief Minister Pramod Sawant) ప్రకటించారు. అలాగే ఈ ఘోర అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడంతో పాటు వారంలోపు నివేదిక అందుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో నైట్‌క్లబ్ మేనేజర్, మరో ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు.
బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ యజమానులు గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాపై కూడా పోలీసులు కేసు నమోదు చేయగా, అర్పోరా-నగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో ఈ అగ్నిప్రమాదం రాజకీయంగా కలకలం రేపింది. ఈ భారీ అగ్నిప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని గోవా కాంగ్రెస్ యూనిట్ పేర్కొనగా.. నైతిక, రాజకీయ కారణాలపై సావంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.