07-12-2025 10:49:03 PM
మహారాష్ట్ర: మహారాష్ట్ర నాసిక్ జిల్లా(Nashik District)లోని ఒక ప్రసిద్ధ మందిరానికి వెళ్లే రోడ్డుమార్గంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 800 అడుగుల లోయలో ఓ కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు మరణించారు. MH15 BN 555 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఇన్నోవా కారు సప్తశృంగి మాత ఆలయం(Saptashrungi Mata Temple) వైపు వెళుతుండగా పదునైన వంపులు, ఇరుకైన రహదారి కావడంతో కారు డ్రైవర్ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. బాధితులను కీర్తి పటేల్(50), రసిలా పటేల్(50), విఠల్ పటేల్(65), లతా పటేల్(60), పచన్ పటేల్(60), మణిబెన్ పటేల్(60)గా గుర్తించగా.. అందరూ కూడా దగ్గరి బంధువులని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ(PM Modi), సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని అందించారు.