calender_icon.png 29 September, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలక్ వర్మకు సీఎం చంద్రబాబు, జగన్ అభినందనలు

29-09-2025 12:03:25 PM

అమరావతి: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్(Asia cup 2025 final) విన్నింగ్ ప్రదర్శన చేసిన భారత క్రికెటర్ తిలక్ వర్మను( Tilak Verma) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(CM Chandrababu), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఒత్తిడిలో తిలక్ వర్మ ప్రశాంతత, ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అతని అసాధారణ ఇన్నింగ్స్ భారత్ ను పాకిస్తాన్‌పై విజయానికి నడిపించిందని పేర్కొన్నారు. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పిచ్‌ను సొంతం చేసుకున్నాడు. అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రదర్శన తెలుగు యువతలో ఉన్న ఉత్సాహం, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని సీబీఎన్ వ్యాఖ్యానించారు. తిలక్ వర్మ తన విజయంతో రాష్ట్రం మొత్తం గర్వపడేలా చేశాడని పేర్కొన్నారు. భారత్ జట్టు 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former AP CM Jagan) తన అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా తిలక్ వర్మ నిలకడగా ఆడిన ప్రతిభను ప్రశంసించారు"ఫైనల్‌లో కీలకమైన ప్రదర్శన, స్థిరమైన ప్రతిభకు మన స్వంత తెలుగు స్టార్ తిలక్ వర్మకు(Telugu star Tilak Varma) ప్రత్యేక అభినందనలు. నిజంగా ప్రశంసనీయమైన ప్రయత్నం," అని జగన్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.