29-09-2025 12:16:53 PM
హైదరాబాద్: సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా ఆడబిడ్డలకు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Ra) శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయంగా కేసీఆర్ అభివర్ణించారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం, తెలంగాణకు ప్రత్యేకమని కేసీఆర్(KCR) తెలిపారు. ప్రకృతిమాత బతుకమ్మ ప్రతి ఇంటినీ ఆశీర్వదించాలని, కష్టాలను తగ్గించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు ఆనందం, శ్రేయస్సును అందించాలని కేసీఆర్ ప్రార్థించారు.