20 May, 2026 | 10:49 PM

మాజీ ఎమ్మెల్యే మృతికి సీఎం సంతాపం

10-11-2024 01:05 AM

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి మృతి

మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సంతాపం 

హైదరాబాద్/కరింనగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): మెట్‌పల్లి (ప్రస్తుతం కోరుట్ల) మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతిదేవి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త కొమొరెడ్డి రాములు సైతం మెట్‌పల్లి ఎమ్మెల్యేగా సేవ లం దించారు. గతేడాడే ఆయన కన్నుమూశారు. జ్యోతి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. 

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమిరెడ్డి జ్యోతిదేవి మరణం పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు.