21 May, 2026 | 12:12 AM

వ్యభిచార ముఠా గుట్టురట్టు

10-11-2024 01:07 AM

నిర్వాహకులు, ముగ్గురు యువతులు, ఒక విటుడి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి) : నగరం నడిబొడ్డున ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టుచేశారు పోలీసులు. లక్డీకపూల్‌లోని అక్షయ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం రాత్రి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో బంగ్లాదేశ్ దేశస్థుడైన ఆర్గనైజర్ సలీం మండల్(36), అతని భార్య(సబ్ ఆర్గనైజర్) మరీయా ఇమ్‌చెన్(27)తో పాటు ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులతో పాటు ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.