calender_icon.png 1 February, 2026 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి

01-02-2026 12:30:06 PM

బాపని బావి తండ సర్పంచ్ బికోజి

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని బాపన్ భావి తండాలో  ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బికోజి కలెక్టర్కు కంప్లైంట్ చేశారు .ఈ విషయంలో వివో ఏ మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తక్షణం చీరలు పంపిణీ చేసి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్య తీసుకోవాలని సర్పంచ్ గ్రామస్తులుకోరారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి సమయంలో సంబంధిత వి ఏవో చీరలు ఉన్న బస్తాలు తీసుకుని వచ్చి, అప్ప చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. ఎన్ని రోజులు తండాలోని సుమారు 50 మందికి పైగా గిరిజన మహిళలకు ఎందుకు ఇవ్వలేదు, విచారణ జరిపించాలని ఆయన కోరారు