23 May, 2026 | 8:48 PM

సీఎం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నడు

21-08-2024 06:29 AM
  1. ఒట్టు వేసి ఎన్నికల్లో గెలిచారు 
  2. రైతుల పక్షాణ బీఆర్‌ఎస్ కొట్లాడుతది 
  3. బీఆర్‌ఎస్ నాయకులు  

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 20(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ లబ్ధి పొందారని  ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కార్పొరేషన్  మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు  రుణమాఫీ చేయాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేస్తానని సవాల్ చేయడంతోనే ప్రభుత్వం రూ.17వేల కోట్లు మాఫీ చేసిందన్నారు.

ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో దాడుల సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చేసే కుట్రలను బీఆర్‌ఎస్ తిప్పికొడుతుందన్నారు. సిద్దిపేటలో దాడుల వెనుక  రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. కేసీఆర్ చనిపోవాలని రేవంత్ కోరడం సరికాదన్నారు. సీఎం తీరుమార్చుకోవాలని హితవు పలికారు.  పూర్తి రుణమాఫీ చేయకుండా హరీశ్ రావును రాజీనామ చేయాలనడం సిగ్గు చేటన్నారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వంద కార్లతో వచ్చి సిద్దిపేటకు ఏం తెచ్చావని  మైనంపల్లి హనుమంత రావును ప్రశ్నించారు. హరీశ్ రావుతో మైనంపల్లికి పోలికేంటన్నారు. సిద్దిపేట అంటేనే కేసీఆర్, హరీశ్ రావు అడ్డా అని గుర్తు పెట్టుకోవాలన్నారు.  కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

హైదరాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి కటక్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారు లు తెలిపారు. ఈ నెల 27న, వచ్చే నెల 3, 10, 17 తేదీల్లో హైదరాబాద్ నుంచి (రైలు నం.07165) రైలు కటక్‌కు బయలుదే రుతుంది. కటక్ నుంచి ఈ నెల 28, వచ్చే నెల 4, 11, 18 తేదీల్లో (రైలు నం.07166) బయలుదేరి హైదరాబాద్ వస్తుందని వివ రించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజ యవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెహరంపూర్, ఖుర్దా రోడ్, భువనే శ్వర్ స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు.