8 April, 2026 | 1:42 PM

నామినేషన్‌కు ముందు మమతా బెనర్జీ పాదయాత్ర

08-04-2026 11:37 AM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బుధవారం తన కాళీఘాట్ నివాసం నుండి భబానిపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నమస్కరిస్తూ, తనదైన చిరునవ్వుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సిన అలీపూర్ సర్వే భవనం(Alipore Survey Building) వైపు దాదాపు 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు  రోడ్డుకు ఇరువైపులా వరుస కట్టిన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు మమతా బెనర్జీ అభివాదం తెలిపారు. ఊరేగింపు సమయంలో, టీఎంసీ కార్యకర్తలు మమతా బెనర్జీ జిందాబాద్, TMC జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.