28 June, 2026 | 7:50 PM

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం

11-05-2026 08:36 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు–2026లో భాగంగా మే 11న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన కేజీబీవీకి చెందిన బాలే శివాని ప్రతిభకు గుర్తింపుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ల్యాప్‌టాప్, ప్రశంసాపత్రం అందుకుంది. జేఈఈ మెయిన్స్‌లో 89.40 పర్సంటైల్ సాధించి రాష్ట్రంలో రెండో స్థానం, జిల్లాలో తొలి స్థానం పొందినందుకు ఈ సత్కారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర గెకో షిరీష , స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.