21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

14-06-2026 12:00 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి 

మేడిపల్లి, జూన్ 13 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో దండు మరియమ్మకు రూ.25,000 సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కును మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్  సింగిరెడ్డి పద్మారెడ్డి అందజేశారు.

ఈ సందర్భం గా వజ్రేష్ యాదవ్, పద్మారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్య భద్రతను, ఆర్థిక భరోసాను కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో  ఉపయోగపడుతుందని, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరంల మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ఉపయోగించుకోవాలని  సూచించారు.

అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందుకున్న దండు మరియమ్మ కుటుంబ సభ్యులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, సింగిరెడ్డి పద్మా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నత్తి మైసయ్య, పడుతం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.