ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం
మల్లాపూర్, జూన్ 12(విజయక్రాంతి): మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం అధ్యాపకులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవల గురించి వివరించారు.
ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఇంటర్ తర్వాత ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సంతోష్, రాజేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటర్ అడ్మిషన్లపై అవగాహన కల్పించి, ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు.






