16 April, 2026 | 5:31 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

30-05-2025 01:06 AM

తూప్రాన్, మే 29 : తూప్రాన్ మున్సిపల్ 11వ వార్డు పడాలపల్లి లోని మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించారు, లబ్ధిదారులైన వెంగలి స్వామికి13 000, నడిపల్లి యాదమ్మ 22 500, తుప్పతి బిక్షపతి 22 500, తుప్పతి మల్లమ్మ 12 500, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పేద వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొంది వెంకట్ గౌడ్, బిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు లంబరాజు యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ కానుకుంట సుదర్శన్, వెంగలి మహేష్ తదితరులు ఉన్నారు.