calender_icon.png 23 July, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కానిస్టేబుళ్లకు టెక్నాలజీపై శిక్షణ

22-07-2025 06:36:23 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనరేట్(Karimnagar Police Commissionerate) పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) తెలిపారు. కమీషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్‌లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ కొనసాగుతుందని ఆయన వివరించారు. కమీషనరేట్ వ్యాప్తంగా నూతన కానిస్టేబుళ్లకు ప్రాథమిక శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 

ఈ వారం రోజుల శిక్షణలో భాగంగా, పిటిషన్ డ్రాఫ్టింగ్ నుండి ఛార్జిషీట్ దాఖలు వరకు గల విధానాలు, ఆర్థికేతర నేరాల గురించి, సీడీఆర్ వంటి అన్ని రకాల సాఫ్ట్‌వేర్, అప్లికేషన్‌లపై సమగ్ర శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. నేరాల ఛేదనలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు జి. విజయ కుమార్, వేణుగోపాల్, ఐటీ కోర్ కార్యాలయ ఇన్‌స్పెక్టర్ జె. సరిలాల్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.