17 July, 2026 | 12:26 PM

బాబుకు సీఎం రేవంత్ అభినందనలు

05-06-2024 01:16 AM

హైదరాబాద్, జూన్4 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.