20 March, 2026 | 9:05 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు : సీఎం రేవంత్

11-11-2024 10:03 AM

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రైతులకు ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడిన, రైతులను వేధించిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.