20 March, 2026 | 10:33 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం

11-11-2024 10:21 AM

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా  2025 మే 13వరకు సీజేఐగా కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు పదవీ విరమణ చేసిన సీజేఐ డివై చంద్రచూడ్ పాల్గొన్నారు. సీజేఐగా నియమితులైన సంజీవ్ ఖన్నాకు న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా శుభాకాంక్షలు తెలిపారు.