20 August, 2026 | 10:59 AM

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ నివాళులు

20-08-2026 10:26 AM

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి(Rajiv Gandhi Jayanti) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘన నివాళులర్పించారు. “దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో జరుపుకునే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. ‘సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి’ అనే స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని, శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.