20 August, 2026 | 10:28 AM

పెద్దమల్లారెడ్డికి బస్సు సౌకర్యం.. విద్యార్థులకు ప్రయోజనం

20-08-2026 09:41 AM

బిక్కనూర్, ఆగస్టు 20(విజయక్రాంతి): బీబీపేట నుంచి జేబీఎస్‌ వరకు పెద్దమల్లారెడ్డి మీదుగా బస్సు సర్వీసు ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వీసుతో ఉదయం రామాయంపేటకు వెళ్లే విద్యార్థులు, ప్రైవేట్‌ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లను గ్రామస్థులు శాలువాలతో సత్కరించారు. బస్సు సర్వీసు ఏర్పాటు చేసిన మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోడూరి సాయగౌడ్, ఉపసర్పంచ్‌ చైతన్య కొండల్‌రెడ్డి, వార్డు సభ్యులు రాధా నర్సింలు, సోషల్‌ మీడియా ప్రతినిధి సురేష్‌రెడ్డి, అల్లాడి సుదర్శన్, గజ్జెల లింగం, మెట్టు బాలయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.