20 August, 2026 | 10:10 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను సందర్శించిన మదరోళ్ళ నిఖిల్

20-08-2026 09:39 AM

బోధన్ ఆగస్టు 20(విజయక్రాంతి): తెలంగాణ విద్యార్థి పరిషత్, బోధన్ డివిజన్ కార్యదర్శి మదరోళ్ళ నిఖిల్ బోధన్ పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యా సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, మౌలిక వసతులను మెరుగుపరచాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు.