calender_icon.png 5 May, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం

19-04-2025 02:43:44 PM

తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి

హైదరాబాద్: జపాన్ తెలుగు సమాఖ్య(Japan Telugu Federation) కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని పేర్కొన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందని సీఎం తెలిపారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ను సీఎం పరిశీలించారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ(Hyderabad Metro Expansion) తెలంగాణ పురోగతికి కీలకం అన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడుు రావాలి.. పరిశ్రమలు పెరగాలని సీఎం ఆకాంక్షించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరమన్న రేవంత్ రెడ్డి ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చన్నారు.  మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండని సీఎం కోరారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.