09-11-2025 01:51:42 PM
హైదరాబాద్: కేటీఆర్ ఎన్నికల ప్రచారం పుష్ఫ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ ను గుర్తుకు తెస్తోందని వ్యంగ్యంగా మాట్లాడారు. నాలుగు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.6.71 లక్షల కోట్లు అని, అందులో రూ.1.29 లక్షల కోట్ల అప్పులకు ఎలాంటి పత్రాలు లేవని, తను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.8 లక్షల కోట్ల అప్పు చూపారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజా గాయకుడు గద్దర్ ను ప్రగతిభవన్ బయటే నిలబెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 2.85 కోట్ల వడ్లను ఉత్పత్తి చేసిందని, కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిందని, రెండు సీజన్లలో 2.85 లక్షల ధాన్యం ఉత్పత్తి చేశామని సీఎం అన్నారు.
కేసీఆర్ పదేళ్లలో రూ.20 లక్షల కోట్ల ద్వారా ఏంచేశారు..?, బీఆర్ఎస్ పాలకులు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?, ఒక్క పాఠశాల అయినా కట్టారా..?, మహిళలకు అధికారం దక్కిందా..? అని అడిగారు. కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులన్ని పెండింగులోనే పెట్టారని, వ్యవసాయం, విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎలాంటి ప్రయోజకం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే కేసీఆర్ పూర్తి చేశారని, కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదన్నారు. కేటీఆర్ విషయంలో కేసీఆర్ ధ్రుతరాష్ట్రుడిగా మారారని, కేటీఆర్ దశే బాకాలేకపోతే కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ఏం లాభం..? వ్యంగ్యంగా మాట్లాడారు. గత పదేళ్లలో కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా తను రద్దు చేయలేదని, ఇప్పటికి వాటిని కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్త పథకాలను తెచ్చామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం తను చేశానని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపానని గుర్తుచేశారు. దేశంలో ఎవరూ చేయని కులగణనను తెలంగాణలో చేసి చూపించానని, తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించానని, మహిళలకు ఉచిత ప్రయాణం సహా అనేక ఎన్నికల హామీలు నెరవేర్చానన్నారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను గుజరాత్ కు వెళ్లేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారని, అలాగే సెమీకండక్టర్ల కంపెనీని గుజరాత్ కు తరలించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడంలేదన్నారు. మూసీ రివర్ డెవలప్ మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల కోసం కృషి చేస్తున్నది మా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి వివరించారు.
వచ్చే పదేళ్లు మేమే అధికారంలో ఉంటాం.. చేపట్టిన ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పైశాచిక ఆనందంతో కేటీఆర్, హరీశ్ రావు ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారని, ముఖ్యమంత్రి కుర్చీ ఏమైనా కేటీఆర్, హరీశ్ రావు తాతల జాగీరా..?, ఎవరిది అగ్రీకల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చరూ ప్రజలు ఆరోపించుకోవాలన్నారు. గల్లీ గల్లీలో గంజాయి కల్చర్ తీసుకొచ్చింది ఎవరో ఆలోచించాలని, సెంటిమెంటా.. డెవలప్ మెంటా.. జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని, గతంలో పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలు తెచ్చారని, రాంరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనూ కేసీఆర్ అదే విష సంస్కృతి తెచ్చారు. మాంగటి గోపినాథ్ నాకు మిత్రుడే .. కానీ నేను అభివృద్ధి చేయాల కాదా.. ఉపఎన్నికల్లో పోటీ పెట్టే విషసంస్కృతిని కేసీఆరే తీసుకొచ్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.