calender_icon.png 9 November, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో అదుపు తప్పి బోల్తా... నలుగురికి తీవ్ర గాయాలు

09-11-2025 01:59:14 PM

చేగుంట,(విజయక్రాంతి): ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు బాధితుల వివరాల ప్రకారం... చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి (25), నర్సింలు (50), లక్ష్మి (60), నర్సమ్మ (40) దైవ దర్శనం కోసం చేగుంట మండలం కర్నల్ పల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయానికి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పొలంపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుకింద బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే 108 అంబులెన్స్  సమాచారం ఇవ్వగా,గాయపడిన వారిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న చేగుంట ఎస్ ఐ 2, బిక్య నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.