09-11-2025 01:23:02 PM
హైదరాబాద్: ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందన్నారు. ప్రజాపాలన ప్రారంభమై రెండెళ్లు గడిచిందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, భవిష్యతు కార్యక్రమాలపై చర్చించుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రూ.4 కోట్ల ప్రజలకు ఇచ్చిందని, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం రుణమాఫీ, ఉచిత కరెంట్ అమలు కోసం వైఎస్ఆర్ సంతకం చేశారని గుర్తు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతంలో నీళ్ల కోసం హైదరాబాద్ లోని సచివాలయం వద్ద మహిళలు ధర్నాలు చేశారని, మహానగర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం కొనసాగిస్తున్నామని తెలిపారు.
ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన ఫార్మా రంగం హైదరాబాద్ లోనే ఉందని, హైదరాబాద్ లోని ఐటీ, ఫార్మా, రంగాలను గత పాలకులు ఎంతో ప్రోత్సహించారని చెప్ారు. దేశానికి వచ్చిన జీసీసీలు, డేటా సెంటర్లలో 70 శాతం హైదరాబాద్ కే వచ్చాయని, దీంతో హైదరాబాద్ హబ్ గా మారిందని ఆయన కొనియాడారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధికి కీలకంగా మారాయని వెల్లడించారు. వైఎస్ హయంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్ ఫోర్టు, ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయని, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ హయంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని, ప్రపంచాన్నే శాసించే సంస్థలు మన రాజధానిలో ఉన్నాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాదు.. సంక్షేమరంగంలోనూ కాంగ్రెస్ పాలకులు తమదైన ముద్ర వేశారని హార్షం వ్యక్తం చేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్ అభివృద్ధికి కృష్టి చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. కేటీఆర్ ఎన్నికల ప్రచారం పుష్ఫ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ ను గుర్తుకు తెస్తోందని వ్యంగ్యంగా మాట్లాడారు.