కిషన్ రెడ్డి సొంతూరిలోనే 100 ఎకరాల భూదన్ భూమి స్వాహా
20-12-2024 04:23 PM
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంతూరిలోనే 100 ఎకరాలు భూదాన్ భూమిని స్వాహా చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ధరణి పోర్టల్ అద్భుతం అయితే సభకు వచ్చి ఎందుకు వివరించటం లేదని ప్రశ్నించారు. తాము తెచ్చే భూ భారతి లోపభూయిష్టం అయితే.. సభకు వచ్చి బహిర్గతం చేయాలి కదా అన్నారు.






