25 April, 2026 | 10:29 PM

మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

25-04-2026 08:59 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని హై కోర్ట్ జడ్జి నంద దర్శించుకున్నారు.ఈ సందర్భంగా జడ్జి నంద కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి చిత్రపటం తో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఆమె వెంట చేర్యాల మున్సిప్ కోర్ట్ జడ్జ్ వి. తరుణి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.