25 April, 2026 | 10:30 PM

చిన్నారుల భవిష్యత్తుపై మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

25-04-2026 08:57 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన యూసుఫ్ ఇటీవల మృతి చెందడం జరిగింది. కాగా అతనికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు యువత ఒకటయ్యారు. చెరువు కట్ట బజార్ సభ్యులు, పదవ తరగతి పూర్వ విద్యార్థులు, ఎంఐ ఎం టీమ్, మజీదు  ఇ మహమ్మదీయ కమిటీ, షేక్ నజీర్ ఫ్రెండ్స్, గిరి ప్రసాద్ బ్యాచ్ అందరూ కలిసి రూ. 405081 డబ్బును సేకరించి ఆ మొత్తాన్ని చిన్నారుల పేరిట పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపార్ట్ చేసి పిల్లల చదువులకు ఎదుగుదలకు బాటలు వేశారు. ఆపదలో ఉన్న ఊరి బిడ్డల కోసం పొనుగోడు చూపిన చొరవ అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు.