03-12-2025 07:34:12 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక ఉన్నత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హిందూ దేవి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారన్నారు. దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి హిందూ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలని, భారత సంస్కృతిని ఆచారాలను పాటించని, ఎల్లప్పుడూ అవమానించే ఇలాంటి పార్టీ భారతదేశానికి అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, గోనె మల్లారెడ్డి, ఏ.మల్లేష్ యాదవ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి డి సీతారాంరెడ్డి, నర్సింగ్ రావ్, అతీష్ బాబు, వెంకటేష్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.