calender_icon.png 3 December, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు ప్రారంభం

03-12-2025 07:36:52 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మూడో విడత బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా 27 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ కోసం 31 నామినేషన్లు, వార్డు సభ్యులకు గాను 84 నామినేషన్లను స్వీకరించడం జరిగిందని ఎంపీడీవో దివ్యదర్శనరావు తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 8 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు గాను వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేశారు.