10 April, 2026 | 1:15 AM

నందినగర్‌లో ఓటేసిన మాజీ మంత్రి కేటీఆర్

13-05-2024 11:24 AM

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నందినగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుటుబంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్ లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ప్రశాసన్ నగర్ లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బార్లు తీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.