calender_icon.png 1 January, 2026 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్‌కు సీఎం న్యూ ఇయర్ విషెస్

01-01-2026 01:11:54 PM

హైదరాబాద్: లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) నిర్వహించారు. లోక్‌భవన్‌ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CMRevanth Reddy) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర వాసులు గవర్నర్(Governor Jishnu Dev Varma) ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంకల్పించిన విజన్–2047 లక్ష్యాలను సాధించడంలో మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు, సహకారంతో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు.