calender_icon.png 1 January, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడ అడవిలో పులి సంచారం

01-01-2026 11:50:40 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవుల్లో(Kothagudem forest) పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కొత్తగూడ మండలంలోని ఓటాయి, రాంపూర్, కర్ణ గండి అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి ఏటా పులులు మేటింగ్ కోసం ఈ ప్రాంతానికి రావడం జరుగుతోందని, ఇదే విధంగా ఈ ఏడాది కూడా పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతాల సమీపంలోని ప్రజలు రాత్రివేళలో ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళకూడదని, పశువులను మేపడానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపించినా, అడవుల ముద్రలు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ ప్రధాన ధ్యేయమని కొత్తగూడ రేంజ్ అటవీశాఖ అధికారి వజహత్ పేర్కొన్నారు.